ఉదయగిరి తహశీల్దార్‌గా ఎల్. రామ్మోహన్ రావు పునర్నియామకం

ప్రభుత్వం ఉదయగిరి మండలానికి కొత్త తహశీల్దార్ (ఎంఆర్వో)గా ఎల్. రామ్మోహన్ రావును నియమించింది. గతంలో ఇక్కడ ఆడహాక్ తహశీల్దార్‌గా పనిచేసి ప్రజల ప్రశంసలు పొందిన ఆయన, రెగ్యులర్ తహశీల్దార్‌గా పదోన్నతి పొంది మార్కాపురానికి బదిలీ అయ్యారు. తాజాగా చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన మళ్లీ ఉదయగిరికి నియమితులయ్యారు. రామ్మోహన్ రావు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్