వింజమూరు, దుత్తలూరు బస్టాండ్లలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్థల పరిశీలన చేపట్టారు. మహిళలు, వృద్ధులు, ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక సదుపాయాలతో వీటిని నిర్మించాలని సూచించారు. పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ సరైన ప్రదేశాలను ఎంపిక చేస్తున్నామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.