ఘాట్‌రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం కోరిన గ్రామస్తులు

ఉదయగిరి నుంచి బండగానిపల్లి వెళ్లే ఘాట్‌రోడ్డు రెండు రోజుల క్రితం కురిసిన స్వల్ప వర్షానికే దెబ్బతిని పలుచోట్ల కొట్టుకుపోయింది. ఈ రహదారి దెబ్బతినడంతో కొండ కింద ఉన్న సుమారు 10 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తారు రోడ్డు వేయాలని గ్రామస్తులు అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా స్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్