సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఏప్రిల్ 1న (బుధవారం) సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వింజమూరులోని పలు ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ, జేసీ కలిసి పరిశీలించి భద్రత, ట్రాఫిక్, వేదిక ఏర్పాట్లపై సమగ్రంగా ఆరా తీశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్