ఏపీకి కొత్త జాతీయ రహదారి

AP: రాష్ట్రంలో కొత్త నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నుంచి భీమిలి వరకు నేషనల్ హైవేను నిర్మించనున్నారు. ఆరు లేన్లుగా 200కి.మీ మేర నిర్మించే ఈ హైవే అందుబాటులోకి వస్తే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య మార్గం సుగమం అవుతుంది. ఈ కోస్టల్ హైవే అవసరంపై ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు.

సంబంధిత పోస్ట్