ఏపీ పింఛన్ల పంపిణీలో కొత్త విధానం.. కేంద్ర వాటా నేరుగా ఖాతాలో జమ

ఏపీలో అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) కింద కేంద్ర వాటా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.4 వేల పింఛన్‌లో కేంద్రం వాటా రూ.200, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్‌లో కేంద్రం వాటా రూ.300 చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలనే కేంద్ర నిబంధనల మేరకు ఈ మార్పులు అమల్లోకి వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕