AP: కోచింగ్ సెంటర్ల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రతి సంస్థ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆదివారం సెలవు ప్రకటించాలి, రోజుకు 5 గంటలకు మించి తరగతులు నిర్వహించరాదు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. విద్యార్థులను ఫీజుల కోసం వేధించరాదని, భవనాలు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. పునరావృతమైతే రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది.