డిప్యూటీ సీఎం పవన్ పర్యటనను పురస్కరించుకొని నందిగామ (M) మునగచర్లలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 12న గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డు ప్రారంభోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. శనివారం MLA సౌమ్య, జనసేన ఇన్‌ఛార్జ్ రమాదేవితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. సభా వేదిక, వాహనాల పార్కింగ్, భద్రతా పరమైన అంశాలపై RDO బాలకృష్ణ, ACP తిలక్, తహశీల్దార్ సురేశ్ బాబులకు పలు సూచనలు చేశారు.