ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోలు, డీజిల్‌కు కొరత లేదని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ప్రజలు అపోహలు నమ్మకుండా, అవసరానికి మించి ఇంధనం కొనవద్దని సూచించారు. రైతుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, అదనంగా 10% సరఫరా ఏర్పాటు చేసి అన్ని బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.