విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఛైర్మన్ గాంధీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ ఈఈ కోటేశ్వరరావుపై అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. ఆయన ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండగా, మళ్లీ విధుల్లో కొనసాగించాలని గాంధీ ఎండోమెంట్ కమిషనర్‌కు లేఖ రాయడం వివాదాస్పదమైంది. ఉద్యోగుల విషయాల్లో ఛైర్మన్‌కు సంబంధం లేకపోయినా ఈ లేఖ రాయడంపై విమర్శలు వస్తున్నాయి.