ఏపీలో దసరా సెలవులపై అధికారిక ప్రకటన

AP: రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులపై విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉంటాయి. అయితే, అక్టోబర్ 10న రెండో శనివారం, అక్టోబర్ 11న ఆదివారం కావడంతో విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచే సెలవులు ప్రారంభమవుతాయి. దీంతో మొత్తం 12 రోజుల పాటు సెలవులు లభిస్తాయి. దసరా సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. గత ఏడాది 9 రోజులు సెలవులు ఇవ్వగా, ఈసారి 12 రోజులు సెలవులు ప్రకటించారు. క్రిస్టియన్ విద్యాసంస్థలకు అక్టోబర్ 15 నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి.

సంబంధిత పోస్ట్

✕
✕