AP: విజయవాడలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్వచ్ఛగ్రామాలు, పట్టణాలు, సంస్థలకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వచ్ఛతను ప్రభుత్వ బాధ్యతగానే కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలని పిలుపునిచ్చారు. నెలలో ఒకరోజు స్వచ్ఛతపై దృష్టి పెట్టాలని, ఐదు కోట్ల మందిలో చైతన్యం తీసుకురావాలని అన్నారు. చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రలో భాగస్వాములైతేనే స్వర్ణాంధ్ర ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.