AP: పేదల ఆరోగ్యం దెబ్బతినకుండా నాణ్యతతో కూడిన మద్యం విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఆబ్కారీశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, నాణ్యత ఉన్న మద్యం విక్రయాలు మాత్రమే రాష్ట్రంలో జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు సారా విక్రయాలు జరగకూడదని స్పష్టం చేశారు. కొత్త విధానంతో ప్రభుత్వ ఆదాయం పెరిగిందన్నారు.