AP: రాష్ట్రంలో జనగణన కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు జనగణన అధికారుల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా, సబ్ డివిజన్, సబ్ డిస్ట్రిక్ట్ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా జనగణన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.