ఈ ఏడాదే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభం

2026-27 విద్యా సంవత్సరం నుంచి పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. శాసనసభలో బుధవారం మెడికల్ కళాశాలపై జరిగిన చర్చలో వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ సత్య కుమార్ యాదవ్ ఈ మేరకు ప్రకటించారు. ఈ కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 420 బెడ్ల బోధనా ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు, అలాగే 237 మంది డాక్టర్లు, 600 మంది సిబ్బందిని నియమించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్