ఉద్యోగ విరమణ చేసిన అప్పారావును ఎమ్మెల్యే బేబి నాయన కొనియాడారు

బొబ్బిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ పరిపాలన అభివృద్ధి అధికారి డి. వి. అప్పారావు ఉద్యోగ విరమణ కార్యక్రమం మంగళవారం బొబ్బిలి శ్రీ కళా భారతిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన, అప్పారావును బహుముఖ ప్రతిభావంతుడని ప్రశంసించారు. ఉద్యోగిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తన గానంతో అందరినీ మంత్రముగ్ధులను చేసి, బొబ్బిలి గంటసాలగా పేరు పొందారని కొనియాడారు. ఆయన ఉద్యోగ విరమణ జీవితం సుఖవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్