రామభద్రపురం మండలం ఆరికతోటలో పురుగు మందు షాపుపై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ టి. అప్పలనాయుడు ఆధ్వర్యంలో బృందం షాపులోని పురుగు మందులు, యూరియా నిల్వలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం పురుగు మందు, యూరియా షాపులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా షాపులో ఉన్న పురుగు మందులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.