జిల్లాలో ఇంధన కొరత లేదని ఎస్పీ స్పష్టం

పార్వతీపురం మన్యం జిల్లాలో పెట్రోల్, డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని, అన్ని బంకుల్లో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి తెలిపారు. ఇంధన విక్రయాలు నిలిపివేసినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా, అసత్య ప్రచారాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని సూచించారు. బంకులను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్