31st నైట్.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: మన్యం ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి సూచించారు. డిసెంబర్ 31న రాత్రి బహిరంగ ప్రదేశాల్లో, రహదారులపై ఈ వేడుకలు నిర్వహించరాదన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలందరూ ఇంటి వద్ద వారి కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర సంబరాలను జరుపుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్