పార్వతీపురం నవిరి కాలనీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియంత్రణతో పాటు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ పాపారావు, ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, పీసీ పోలిరాజు పాల్గొన్నారు. వాహనదారులకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ, నియమాలను పాటించాలని సూచించారు.