ఏఎన్ఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

మక్కువ మండలం తూరు మామిడి గ్రామంలో ఆశావర్కర్ శ్రీదేవిపై ఏఎన్ఎం లక్ష్మీ దాడి చేసిందని ఆరోపిస్తూ యూనియన్ నేతలు మండిపడ్డారు. నవంబర్ 22న ఏఎన్ఎం లక్ష్మి ఆశా వర్కర్‌ను దూషించి కొట్టిందని సిఐటియు నేతలు వి. ఇందిరా, మన్యం జిల్లా కార్యదర్శి శివాని తెలిపారు. గతంలో ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్