పార్వతీపురంలో ఏప్రిల్ 22న 6,000 మంది విద్యార్థులు ప్రధాన రహదారిపై కోలాట ప్రదర్శన ఇవ్వనున్నారు. 120 గ్రూపులుగా విభజించి, 18 నిమిషాల పాటు ఈ ప్రదర్శనను లిమ్కా బుక్ రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు కలెక్టర్ డా.ప్రభాకర రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు బ్లాక్, వైద్యం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.