మందుల చీటీలు తెలుగులో రాయాలి: కలెక్టర్ సూచనలు

పార్వతీపురం పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలు, రికార్డులను పరిశీలించి, సిబ్బందితో సమావేశమయ్యారు. నాణ్యమైన వైద్యం అందించాలని, మందుల చీటీలు తెలుగులో స్పష్టంగా రాయాలని, ఆసుపత్రిలో పరిశుభ్రత, పచ్చదనం, ప్రశాంత వాతావరణం కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్