పాచిపెంట మండలం గొట్టూరు గ్రామంలోని పాఠశాల భవనానికి స్లాబ్ లేకపోవడంతో విద్యార్థులు ఎండలోనే చదువుకోవాల్సి వస్తోందని, తక్షణమే స్లాబ్ వేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన స్థానిక పాఠశాలను సందర్శించి, గతంలో అధికారులకు వినతి పత్రాలు అందించినా స్పందన లేదని, భవనం మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.