పార్వతీపురం: 5న సీఎం చంద్రబాబు పర్యటన

ఈనెల 5వ తేదీన భామినిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో, మంగళవారం భామినిలో మన్యం జిల్లా అధికారులతో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేటాయించిన పనులను పక్కాగా నిర్వహించాలని, ముఖ్యంగా విద్యుత్, రహదారులు, ట్రాఫిక్, మెడికల్ సర్వీసులు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రోటోకాల్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్