పార్వతీపురం: ఈ నెల 7న పాలకొండలో మినీ జాబ్ మేళా: కలెక్టర్

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధికల్పన సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన పాలకొండలో మినీ జాబ్ మేళా జరగనుందని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ఉపాధికల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ చదువుకుని 18 నుంచి 32 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్