రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఆయన సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా కొందరు ఉపాధ్యాయ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి బదిలీలపై మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. వెబ్ కౌన్సెలింగ్ బదులు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ట్వీట్ చేశారు. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు తనకు తెలియజేశారన్నారు