మంగళవారం జిల్లా కేంద్రంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు. కొమరాడ మండలం కుమ్మరిగుంటకు చెందిన బొమ్మాన కృష్ణవేణి, తన కుమార్తె సౌమ్య పదో తరగతిలో 577 మార్కులు సాధించిందని, ఆమె ఉన్నత చదువులకు ఎంత కష్టమైనా, నష్టమైనా చదివిస్తానని భావోద్వేగానికి గురయ్యారు. ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే సౌమ్య ఉన్నత స్థానానికి చేరుకుంటుందని, చదువుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.