జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు

పార్వతీపురం జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణకు డీఎంహెచ్‌ఓ డా. భాస్కరరావు ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో జ్వరాలు, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మలేరియా అధిక ప్రమాదం ఉన్న 779 గ్రామాల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి. తొలి రోజు 58 శిబిరాల్లో 3,071 మందికి, రెండో రోజు 226 శిబిరాల్లో 14,876 మందికి ఆరోగ్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు శిబిరాలను పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్