జామి: డి వార్మింగ్ డే పై సమీక్ష సమావేశం

ఈనెల 10న నిర్వహించనున్న డి వార్నింగ్ డే పై జామి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నీలం అప్పలనాయుడు గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆదేశాలు మేరకు ఆయా శాఖల అధికారులు డి వార్మింగ్ డే నిర్వహణపై ప్రణాళికలు సిద్ధం చేయాలని మండల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో ఈఓపిఆర్డి ఉమా, ఎంఈఓ జయశ్రీ, స్ధానికి పీహెచ్సీ అధికారిణి సామ్రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్