జిల్లాలో సవరణ అనంతరం జనవరి 6న ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం 15, 68, 048 మంది ఓటర్లు ఉన్నారని డిఆర్వో ఎస్. శ్రీనివాసమూర్తి తెలిపారు తెలిపారు. గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్వో తమ ఛాంబర్‌లో సమావేశాన్ని నిర్వహించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణలకు సంబంధించిన ధరఖాస్తుల స్థితిని సీఈఓఆంధ్రా. ఎన్ఐసి. ఇన్ వెబ్‌సైట్‌లో వివరాలు ఉంటాయని చెప్పారు.