జిందాల్ భూములకు సంబంధించి మిగిలిన రైతులకు పరిహారాన్ని వారం రోజుల్లో అందజేయాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. జిందాల్ కు కేటాయించిన భూములకు సంబంధించి తమ ఛాంబర్‌లో అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అసైన్డ్ భూములకు సంబంధించి పెండింగ్లో ఉన్న 11 మంది రైతులకు వారం రోజుల్లో పరిహారాన్ని అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.