విజయనగరం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజా శాంతికి ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పి వకుల్ జిందాల్ అన్నారు. ఆదివారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 207 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జనవరి నుండి నేటి వరకు 1814 ఓడి కేసులు, 6275 డీడీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్