విజయనగరం: ఎరువుల సమస్య ఉంటే ఈ నంబర్ కు కాల్ చేయండి

రైతులు ఎరువుల విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా 83310 56279 నంబరుకు డయల్ చేసి జిల్లా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం తెలిపారు. జిల్లాలో విత్తనాలు, ఎరువులు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం జిల్లాలో 12,948 హెక్టార్లలో పంటలు సాగు జరుగుతుండగా, రైతుసేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్