పవన్ కళ్యాణ్ శాఖకి చివరి ర్యాంక్ !

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు శాఖల వారీగా పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. 100 పాయింట్లతో బీసీ సంక్షేమ శాఖ మొదటి స్థానంలో నిలవగా, 67 పాయింట్లతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి గా ఉన్న అటవీ, పర్యావరణ శాఖ చివరి స్థానంలో నిలిచింది. 90 శాతం పైగా పాయింట్లతో 18 శాఖలు మెరుగైన పనితీరు కనబరిచాయి. ఈ ర్యాంకింగ్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ఆధారంగా ఇవ్వబడింది.

సంబంధిత పోస్ట్