ఏపీలో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగానే జరగనుంది. రేపు ఆదివారం కావడంతో, లబ్ధిదారులకు ఈరోజే నగదు అందజేస్తున్నారు. సీఎం చంద్రబాబు కుప్పంలోని గుడుపల్లె మండలం బెగ్గిలిపల్లెలో నగదు పంపిణీని ప్రారంభించనున్నారు. కొత్తగా మంజూరైన 7,944 వితంతు పింఛన్లతో కలిపి మొత్తం 62.94 లక్షల మందికి ఈ పింఛన్ల ద్వారా లబ్ధి చేకూరనుంది. సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే నగదును అందజేస్తారు. ఒకవేళ ఈరోజు నగదు తీసుకోలేకపోతే.. ఫిబ్రవరి 2న తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.