అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్ పునరుద్ధరణ

AP: రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్‌ను పునరుద్ధరిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాల్లో జీవనోపాధి కోల్పోయిన 1,575 కుటుంబాలకు పింఛన్ మంజూరు చేస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. మరోవైపు నేలపాడు ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్ పెండింగ్ పనుల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.524.70కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్