AP: పిల్లల ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల బియ్యం కార్డు వివరాలు నమోదు చేసి వీఆర్వో, తహసీల్దార్ పరిశీలనకు పంపుతారు. వారు అనుమతించగానే రేషన్ కార్డులో పిల్లల పేర్లు చేరుస్తారు. కార్డులో చిరునామా మార్పులకూ అవకాశం ఉంటుంది. అర్హులైన లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలు, వీఆర్వోలను సంప్రదించాలి. జులై నుంచి డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికిి జనవరిలో కొత్త బియ్యం కార్డులు అందజేయనున్నారు.