PMAY- గ్రామీణ్ పథకం దరఖాస్తు గడువు పొడిగింపు

AP: గ్రామాల్లో ఇళ్లు లేని పేదలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY)- గ్రామీణ్ పథకం దరఖాస్తు గడువును పొడిగించింది. నవంబర్ 5న గడువు ముగియగా.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ నెల 30 వరకు పొడిగించింది. అర్హులు సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ సాయంతో ఆవాస్+యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఇంటి నిర్మాణానికి రూ.2.5 లక్షలు అందిస్తారు. అర్హులైన వారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్