వైసీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు.. నోటీసులు జారీ

విజయవాడలో డీఎస్పీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 21న జరగాల్సిన ర్యాలీకి అనుమతి లేదని, నగరంలో ఎలాంటి నిరసన ర్యాలీలకు అనుమతి లేదని మాచవరం పోలీసులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లి పోలీసులు ఈ మేరకు నోటీసులు అందజేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు, ఆందోళనలు చేపడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕