కనిగిరి మున్సిపాలిటీలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ప్రజల నుండి 15 అర్జీలు వచ్చినట్లుగా కనిగిరి తహసిల్దార్ చింతలపూడి అశోక్ కుమార్ రెడ్డి తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకం కొరకు 10, భూమి సర్వే నిమిత్తం 2, ఇంటి పట్టాల కొరకు 2 అర్జీలు, 22ఏ 1/సి ఎండోమెంట్ భూముల నుండి తొలగించమని ఒక అర్జీ వచ్చినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ వైష్ణవి, ఎండోమెంట్ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.