అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కంభం రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. విశాలమైన వెయిటింగ్ హాల్, ఆధునిక టికెట్ కౌంటర్లు, మెరుగైన ప్లాట్‌ఫారాలు, ఆకర్షణీయమైన లైటింగ్‌తో స్టేషన్ ప్రాంగణం అందంగా మారింది. ఒంగోలు గిత్తల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.