మార్కాపురం రూరల్ ఎస్సైగా వేమన

మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా వేమన గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పొదిలిలో విధులు నిర్వహించి, వీఆర్ కు వెళ్ళిన వేమనను మార్కాపురం రూరల్ ఎస్సైగా నియమిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న అంకమ్మరావును ఎస్పీ వీఆర్ కు బదిలీ చేశారు. ఈ నియామకం ద్వారా స్థానిక పోలీసు యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి.

సంబంధిత పోస్ట్