ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏ. ఈ మోహన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో ఉప్పలపాడు, పిచ్చిరెడ్డి తోట, మరిపూడి, రాజుపాలెం, స్టోన్ క్రషర్స్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.