దర్శిలో ఆగస్టు 2వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లలో శుక్రవారం జిల్లా ఎస్పీ దామోదర్ పరిశీలించారు. దాదాపు 800 మంది పోలీసు సిబ్బందితో భద్రతలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు దర్శికి వస్తున్నారని టీడీపీ ఇన్ ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.