ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దర్శి మండలం తూర్పునాయుడుపాలెంలో ఆగస్టు 2వ తేదీన పర్యటిస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. శుక్రవారం సీఎం కాన్వాయ్ ట్రైల్ రన్ అనంతరం ఎస్పీ దామోదర్ మీడియాతో మాట్లాడారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య సీఎం పర్యటన సాగుతుందని అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు దర్శి వస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.