దర్శిలో గ్రంథాలయం మార్పు

దర్శిలో గత 25 ఏళ్లుగా అద్దె భవనంలో, పట్టణానికి దూరంగా ఉన్న ప్రభుత్వ గ్రంథాలయాన్ని ప్రధాన కూడలిలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలోకి మార్చాలని తహశీల్దార్ శ్రావణ్ కుమార్ ఆదేశించారు. విద్యార్థులకు విజ్ఞాన గని అయిన ఈ గ్రంథాలయం డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, అద్దె భవనంలో ఎదురవుతున్న ఇబ్బందులను, విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్