ప్రకాశం జిల్లా దర్శిలోని దొనకొండ మండల నూతన ఎస్ఐగా రామక్రిష్ణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఒంగోలు తాలుకా స్టేషన్ నుండి ఎస్పీ హర్ష వర్ధన్ రాయ్ ఆదేశాల మేరకు ఆయన దొనకొండకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది, మండల ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు నూతన ఎస్ఐ రామక్రిష్ణను కలిసి ఘనంగా స్వాగతం పలికారు.