ప్రకాశం జిల్లా, తాళ్లూరు మండలంలోని నాగంబొట్లపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. తూర్పుగంగవరం వద్ద నిర్మిస్తున్న 132/33 విద్యుత్ సబ్ స్టేషన్ కు పొదిలి నుండి తూర్పుగంగవరం వరకు లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు దర్శి సబ్ డివిజన్ ఈఈ రవికుమార్ ఆదివారం తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.