దర్శి డివిజన్ పరిధిలోని 132 తూర్పుగంగవరం సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నందున, శనివారం పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ పాలగిరి శ్రీనివాసులు తెలిపారు. పొదిలి నుంచి తూర్పుగంగవరం వరకు నూతన 132 కేవీ డీసీ లైన్ పనులు జరుగుతాయి. ఈ కారణంగా, బొద్దికూరపాడు, నాగంబొట్లపాలెం, లక్కవరం విద్యుత్ సబ్ స్టేషన్లు, అలాగే పొదిలి సెక్షన్ పరిధిలోని ఏలూరు గ్రామానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.